NewsTelangana

మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధం

Share with

తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా సమర్పించానన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన రాజగోపాల్ రెడ్డి… స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాజీనామా లేఖను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి కోసం వచ్చిందని… అందరి పోరాట ఫలితమని అన్నారు. ఆత్మగౌరవం కోసం రాష్ట్రం కోసం పోరాడామన్నారు. రాజీనామాతో కేసీఆర్ దిగొస్తారని… మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ను తరిమికొడతారన్నారు. ప్రజలకు త్వరలోనే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కేసీఆర్‌కు పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తుకురావాలన్నారు. మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని అభివృద్ధి ఆపేశారన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తెలంగాణ అంతటా మునుగోడు గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ఉపఎన్నిక ఎందుకు వస్తోందని అనుకుంటున్నారన్నారు. స్వార్థపరుడ్నైతే ఎన్నిక కోరుకునేవాడిని కానన్నారు. ధైర్యం ఉండబట్టే రాజీనామా చేసి ఎన్నికల్లో ప్రజల తీర్పు కోరుతున్నానన్నారు. కొందరు గిట్టనివారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని… వాటికి భయపడేది లేదన్నారు. ఇది తన కోసం చేస్తున్న యుద్ధం కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు రాజీనామా అంటూ ప్రకటించిన వెంటనే గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజలకు ఉద్యోగాలు లభించాలని, పింఛన్లు అందాలని, డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు జరిగాలనే రాజీనామా చేశానన్నారు.

కేసీఆర్ కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప మరో నియోజకవర్గం కన్పించడం లేదన్నారు. లక్ష రుణమాఫీ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులు కట్టి వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని అన్నారు. మిషన్ భగీరథలో 25 వేల కోట్లు దొచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వాలంటే అప్పులు తేవాల్సి వస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్రోహుల పార్టీగా మారిందన్న రాజగోపాల్ రెడ్డి… గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ వీరందరూ ఉద్యమకారులా అంటూ ప్రశ్నించారు. స్పీకర్ త్వరలోనే రాజీనామాను ఆమోదిస్తారనుకుంటున్నానన్నారు. పీసీసీ చీఫ్ భాష వింటే ఆయన సంస్కారమేంటో అర్థమవుతుందన్నారు. అలాంటి వ్యక్తికి పీసీసీ బాధ్యతలు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారుపై ధర్మయుద్ధ ప్రకటించానన్న రాజగోపాల్ రెడ్డి… ప్రజాక్షేత్రంలోనే అన్నీ తేల్చుకుంటానన్నారు.