ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా డబ్బుల బదిలీ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీ అకౌంట్ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు రూ.5.2 కోట్లు బదిలీ చేశారని, ఈ డబ్బును ఓటర్లతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వినియోగించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఈసీకి టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం 4 గంటల్లోపు వివరణ ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు ఇచ్చింది. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోందని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.


 
							 
							