ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వ పరిహారం ఎంతంటే..
కశ్మీర్‌లోని పహల్గాం వద్ద బైసరన్ లోయలో ఉగ్రదాడి బాధితులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనతో వణికిపోయిన పర్యాటకులు వారి సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఇప్పటికి ఆరు గంటల వ్యవధిలో విమానాల ద్వారా 3,300 మంది శ్రీనగర్ నుండి వెళ్లినట్లు విమానయాన శాఖ పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీ షెడ్యూల్ ఛార్జీలను రద్దు చేసినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా పరిణామాలపై స్పందించారు. కశ్మీర్ నుండి అతిథులు వెళ్లిపోతుంటే చాలా బాధగా ఉందని, తన హృదయం ద్రవించిపోతోందని, కానీ వారి తిరుగు ప్రయాణం కోసం రోడ్డు మార్గంలో కూడా మంచి ప్రయాణ సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.
Breaking news: ‘కశ్మీర్‌పై మా ఆశ చావదు’..పాక్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు

