‘స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో’.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో అంతగా రాణించడం లేదు. ఈ విషయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కిల్లినన్ రోహిత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అంటూ ఎద్దేవా చేశాడు. ఫ్లాట్ ట్రాక్‌లపై మాత్రమే ఆడగలడని పేర్కొన్నాడు. కోహ్లితో పోలిస్తే రోహిత్ ఏమాత్రం ఫిట్‌గా లేదని, అధిక బరువుతో సతమతమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇకపై ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు పనికిరాడని, వన్డేలలోనే ఆడొచ్చని పేర్కొన్నాడు.

