నా కూతుర్ని వేధించాడు…అందుకే చంపేశా
నేరాల విషయంలో ఏపి మరో బీహార్‌లా మారింది.ఈ విషయం ఎవరు ఒకప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) కొద్దిగా వెనుకంజ వేసి డేటా ఇచ్చినా సరే ఇది నిజం. నిత్యం ఏపిలో ఏదో మూలన చైల్డ్ హెరాస్‌మెంట్ అనేది నిత్యకృత్యంగా మారింది.అయితే బలం ఉన్న చోట కేసులు నమోదౌతున్నాయి.బలం లేని చోట కన్నీళ్లు సంద్రమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జరగిన ఓ ఘటన విషయంలో తండ్రే కాలయముడిగా మారి తీర్పునిచ్చాడు.తన 12 ఏళ్ల కూతురి పట్ల తన చెల్లిలి మామ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆయన ఈ మర్డర్ చేశాడు.పైగా ఆ హత్య చేసింది తానే అని నిర్భయంగా ఒప్పుకున్నాడు. అన్నమయ్య జిల్లా మంగంపేట గ్రామానికి చెందిన ఆంజనేయ ప్రసాద్ దంపతులు పొట్టకూటి కోసం కువైట్ వెళ్లారు.ఈ నేపథ్యంలో తన 12 ఏళ్ల కుమార్తెను తన చెల్లెలి ఇంట్లో ఉంచి వెళ్లారు.ఇటీవల తండ్రి ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి మంగంపేటకు వచ్చాడు.ఈ సమయంలో కూతురు తన పట్ల తాతయ్య వ్యవహరించిన తీరుని వివరించింది.దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయినా పట్టించుకోలేదు.దీంతో తన మామ(చెల్లెలి మామ) అంజనేయులుని కిరాతకంగా చంపేసి కువైట్ వెళ్లిపోయాడు ఆంజనేయ ప్రసాద.అక్కడకు వెళ్లి సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశాడు.ఈ విషయంపై పోలీసులకు తాను,తన భార్య ఇద్దరం ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వల్లే తాను ఈ హత్య చేశానని,ఒక కూతురికి ఇంత కన్నా ఎవరైనా న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు.తాను చేసింది కరెక్టే అనుకుంటున్నానని సమర్దించుకున్నాడు. అయితే ఇప్పుడు అతన్ని ఇండియాకి ఎలా తీసుకొస్తారు? దీనికి కువైట్ చట్టాలు అంగీకరిస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇలాంటి విషయాల్లో కువైట్‌లో ఇలాంటి తీర్పులే వెలువడుతుంటాయి.సో నిందితుణ్ని భారత్ పంపేందుకు అక్కడి చట్టాలు వర్తిస్తాయా అన్నది సంశయంగా మారింది.

