నిశ్చితార్థం వేళ వరుడి ఆత్మహత్య..
ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో పురోహితుడిగా జీవనం కొనసాగిస్తున్నారు వింజమూరి వెంకటేష్(30). అతడికి ఆదివారం ఉదయం నిశ్చితార్థం అనగా, అనూహ్యంగా శనివారం అర్థరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. అతడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్యలు లేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. శనివారం నాడు వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. నిశ్చితార్థం కోసం ముచ్చటపడి ప్రత్యేకంగా ఉంగరాలు కూడా ముంబయిలో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, కొత్త దుస్తులు, ఇతర సామాగ్రి కొనుక్కున్నాడని వారు చెప్తున్నారు. ఊహించని విధంగా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

