Home Page SliderTelangana

మహిళలకు ఫ్రీ బస్సు..అయితే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు వచ్చినప్పటి నుండి పురుషులకు సీట్లు దొరకడం లేదని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీనితో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలు బస్సులోని అన్ని సీట్లు ఆక్రమిస్తుండడంతో పురుషులకు స్థలం లేక, టిక్కెట్ తీసుకుని కూడా దిగిపోతున్నారు. ఈ విషయాన్ని ఆన్‌లైన్ మీటింగుల్లో  ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తెచ్చారు అధికారులు. దీనితో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంలో ఆర్టీసీ పునరాలోచిస్తోంది.

పురుషుల కోసమే కాకుండా, విద్యార్థులకు, వృద్ధులకు ప్రత్యేక బస్సులు, బస్సులలో వృద్ధుల సీట్ల పెంపు విషయంలో కసరత్తులు జరుగుతున్నాయి. గతంలో మహిళా ప్రయాణికులు 12 నుండి 14 లక్షల దాకా ఉండగా, ఇప్పుడు 30 లక్షల దాకా ఉంది. దీనితో బస్సులు సరిపోవడం లేదు. నిలబడడానికి కూడా స్థలం చాలక, చాలామంది అవస్థలు పడుతున్నారు. సమయానుకూలంగా విద్యార్థులకు ప్రత్యేక బస్సులపై కూడా దృష్టి పెట్టామని అధికారులు చెప్తున్నారు. ఈ విధానాలు అమలుకు సాధ్యం కాకపోతే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే విషయం ఆలోచిస్తామని ఆర్టీసీ తెలియజేస్తోంది.