Home Page SliderTelangana

ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ దూకుడు..నవంబర్ 9 వరకూ కేసీఆర్ ఉద్థృత ప్రచారం

Share with

గత కొన్నిరోజులుగా అనారోగ్యంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకున్న వెంటనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలలో దూకుడుగా ప్రచారం కొనసాగించమని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. నవంబర్ 9 వరకూ వివిధ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం 17 రోజులలోనే 41 బహిరంగ సభలు పెట్టాలని షెడ్యూల్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రచార షెడ్యూల్‌ను బీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన అభ్యర్ధులకు బీఫాంలు కేసీఆర్ స్వయంగా అందజేయబోతున్నట్లు ప్రకటించారు. అదేరోజున సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో బహిరంగ సభ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఎన్నికల తేదీ విడుదల తర్వాత మొదటి సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పండుగ, బతుకమ్మ సంబరాలు పూర్తయిన తర్వాత ఈ నెల 26 నుండి తిరిగి ప్రచారంపై దృష్టి సాధిస్తారు. 19 నుండి 25 వరకూ దసరా సందర్భంగా విరామం ప్రకటించారు. అనంతరం నవంబర్ 9 వరకూ భారీ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రచార షెడ్యూల్‌ను, ముఖ్యమంత్రి నిర్వహించబోయే బహిరంగ సభల ప్రాంతాలను పార్టీ ప్రకటించింది.