NationalNews

థాక్రే పతనానికి ఆ నలుగురు కారణం

Share with

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పతనానికి నలుగురు వ్యక్తులు కారణమంటూ విమర్శించారు శివసేన రెబల్ ఎమ్మెల్యే రమేష్ బోర్నారే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టడం శివసైనికులందరికీ సంతోషాన్నిచ్చిందన్నారు వాయిజాపూర్ ఎమ్మెల్యే. థాక్రే చుట్టూ ఉన్న నలుగురు కొటారీ వల్లే శివసేనలో తిరుగుబాటు జరిగిందన్నారు. విశ్వాస పరీక్షలో ఎక్‌నాథ్ షిండే గెలుపు… మహారాష్ట్రలో పండుగ వాతావరణం సృష్టించిందన్నారు. 55 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది షిండే గ్రూపులో చేరారంటే… వారందరికీ ఎన్ని అవమానాలు జరిగాయో ఊహించుకోవచ్చన్నారు.

మొత్తం పరిణామాలకు థాక్రే బాధ్యులు కారని… నలుగురు కొటరీ అందుకు కారణమన్నారు. పార్టీ ఈ రోజు ఇలా ఉండటానికి నలుగురు నేతలే కారణమన్నారు. శివసేన ఎమ్మెల్యేలను కోటరీ పురుగులు కన్నా హీనంగా చూసిందన్నారు. ఐతే తాము ఎన్నటికీ థాక్రే కుటుంబాన్ని మరచిపోమని.. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం తాను షిండే గ్రూపులో చేరానన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కాకుంటే… వాయిజాపూర్ ప్రజలు తనను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారన్నారు. శివసైనికులకు సరైన సమాచారం లేకరపోవడం వల్లే గౌహతిలో ఉన్న సమయంలో ఆందోళనకు దిగారని… ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయన్నారు.