NationalNews

సీఎంగా ఏక్ నాథ్, డిప్యూటీగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం

Share with

మహారాష్ట్ర రాజకీయం మలుపులు తీసుకొని కొత్త పంథాను ఆవిష్కరించాయి. దేశవ్యాప్తంగా గత పది రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడింది. హిందుత్వ పార్టీ శివసేనపై తిరుగుబాటు చేసిన షిండే మహా ఐతే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించిన… చివరకు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి కొత్త శకాన్ని ఆవిష్కరించారు. సీఎం కావాల్సిన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన అసాధారణ పరిణామాలు ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనేయాంశంగా మారాయి.

గుజరాత్ సూరత్ లో మొదలైన దుమారం గౌహతిలో పతాక స్థాయికి చేరుకొని… ఆ తర్వాత గోవా నుంచి ముంబై మీదుగా తుఫాను తీరం దాటింది. మొత్తంగా ఒక తిరుగుబాటుదారుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలో ఇది తొలిసారి కావచ్చు. బీజేపీ లాంటి పార్టీని ఒప్పించి… మెప్పించి ఏక్ నాథ్ షిండే చరిత్ర సృష్టించారు. ప్రధాన పార్టీలకు సంబంధం లేకుండా చీల్చిన పార్టీకి అధినేతగా ఇప్పుడు షిండే కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు.