త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటా- మాజీ హోం మంత్రి సుచరిత
వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు నుంచి కొద్దిరోజుల్లో తప్పుకుంటానన్నారు మాజీ హోం మంత్రి సుచరిత. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానానికి లేఖ పంపిస్తానని వెల్లడించారు. ప్రజల అభివృద్ధి దృష్ట్యా ప్రత్తిపాడు నియోజక వర్గానికే పరిమితం కావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కాలుతో తంతా అన్నప్పుడే అయ్యన్న పాత్రుడుని లోపల వేయ్యాలిసిందని కాని జాప్యం జరిగిందని వివరించారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడతాడో సైకిలు యాత్ర చేపడతాడో, పాదయాత్ర చేపడ తాడో ఆయన ఇష్టమన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని… అన్ని వర్గాల ప్రజలు కోసం దేశంలో లేనటు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశం పెట్టిందన్నారు. సుచరిత పార్టీ బాధ్యతలను నుండి తప్పకుంటా అని ప్రకటించడంతో ఈ విషయం గుంటూరు జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

