Home Page SliderTelangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

పరారీలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇవాళ దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. 2023లో ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని తప్పించారని షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో ఏ-3గా షకీల్.. పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసులు గతంలో వెల్లడించారు. దీంతో కొంత కాలంగా షకీల్ దుబాయ్ లోనే మకాం వేశారు. ఈ క్రమం లో తాజాగా ఆయన తల్లి మరణించగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అలర్ట్ అయిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. దాంతో ఆయనను బోధన్ కు తీసుకువెళ్తున్నట్లు సమాచారం.

Breaking news: హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్ మృతి