నేటితో కమల్‌హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్..
తాజా సినిమా ‘థగ్ లైఫ్’. డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో KH234 ప్రాజెక్టుగా వస్తోన్న థగ్ లైఫ్‌లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫిమేల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శింబు కీలక పాత్రలో యాక్ట్ చేస్తుండగా.. గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నేటితో థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా బాగా రేటు పలికాయి. రూ.149.7 కోట్లకు అమ్ముడుపోయాయి. కోలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన సినిమా కావడం విశేషం. థగ్ లైఫ్ చిత్రాన్ని 2025 సమ్మర్ వెకేషన్‌లో వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ క్రేజ్ ఏవిధంగా ఉందో తాజా సమాచారం ద్వారా మరోసారి తెలుస్తోంది. కొత్త థగ్ (క్రిమినల్)కు స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది అంటూ మేకర్స్ షేర్ చేసిన శింబు సిగ్మా థగ్ రూల్ వీడియో ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. మణిరత్నం టీం ఇప్పటికే థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ సినిమాని కమల్ హాసన్ – ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్ – ఆర్ మహేంద్రన్ కలిసి తీస్తున్నారు.