NewsTelangana

36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు

Share with

36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ ఆంక్షలు విధిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు. రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్‌ కానున్నాయి. సాయంత్రం 5 గంటల నాటికి ఇక్కడ వరద మట్టం.. 61.80 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇప్పటికే భద్రాచలం పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే.

Read More: బీజేపీ మెప్పు కోసం తహతహలాడుతున్న టీడీపీ, వైసీపీ !