NewsTelangana

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాడం ఖాయం!

Share with

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పై విసిగిపోయారని… మార్పు కోరుకుంటూన్నారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌. పుత్ర వాత్సల్యం కారణంగా మహారాష్ట్ర, బీహార్‌ ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్కు కుట్రలు,కుతంత్రాలు తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుందన్నారు. అందుకనే ప్రజలు బీజేపీ వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న అదరణ, అనుకూలంగా వస్తున్న ఫలితాలు ఒంటరిగా పోటి చేసి నాలుగు పార్లమెంట్ స్ధానాలు సాధించుకున్న ప్రకియ నుంచి మెదలుకొని దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ధమాకా సృష్టించిందని… హుజూరాబాద్‌లో జీహుజూర్ అనిపించిందని లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణకు టీఆర్ఎస్ శనిలా మారిందని అవినీతి, ఆరాచక ప్రభుత్వాన్ని కుకటి వేళ్లతో పెకిలి వేయాలని తెలంగాణ సమాజం కోరుకూంటుందన్నారు. మోదీ ఆకాంక్ష మేరకు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాడం ఖాయమన్నారు.