ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం.. వేల మంది తరలింపు
ఇజ్రాయెల్‌లోని జెరూసలెం శివారులోని కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఈ కార్చిచ్చుతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంలోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరో పక్క ఇజ్రాయెల్‌లో భారీ ఇసుక తుఫాను కలకలం రేపుతోంది. దేశ దక్షిణ భాగాల్లో నెగెవ్ ఎడారి, బీర్షెబా ప్రాంతాలను దూళిమబ్బులు కమ్ముకున్నాయి. ఈ తుఫాను ఇజ్రాయెల్ సైనిక స్థావరాల వరకు చేరుకున్నట్టు సమాచారం. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

