జగన్ వల్లే స్టీల్ ప్లాంట్ బతికింది
విశాఖ స్టీల్ ప్లాంట్ ని చాలా మంది స్వాధీనం చేసుకోవాలని చూసినా వైసీపి అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందు చూపుతోనే బతికిందని మాజీ మంత్రి ,విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు.కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ ను తొలుత ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామని కానీ దానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత వ్యతిరేక తీర్మానం చేయించారని దాంతో ప్రయివేటీకరణ ఆగిపోయిందని చెప్పారని గుడివాడ గుర్తు చేశారు.అయితే కేంద్రం ఇచ్చిన రూ.11,400 కోట్ల ప్యాకేజీ ఏమాత్రమూ సరిపోదని,ప్రైవేటుకు ఇస్తున్న మైన్స్ స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వాలని ,స్టీల్ ప్లాంట్ కు టాక్స్ హాలిడే ఇవ్వాలని, ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చెయ్యాలని,సొంతంగా గనులు కేటాయించాలని, రాష్ట్రపతి పేరు మీద ఉన్న స్టీల్ ప్లాంట్ భూములను స్టీల్ ప్లాంట్ పేరు మీదకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.