ఘోర బస్సు ప్రమాదం..ఏడుగురు మృతి
గుజరాత్ కచ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కేరా-ముద్రా రోడ్డులో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

