NewsTelangana

బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్

Share with

జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణ బీజేపీకి పార్టీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇకపై మరో లెక్క… తెలంగాణలో బీజేపీ గెలవాలంటే అందుకు గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా… స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే సమిష్ట నాయకత్వంతో పనిచేయాలని హితవు పలికిన నేతలు ఇకపై అందరూ పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికలపై కమిటీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫైనాన్స్‌కు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయనానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కమిటీ ఏర్పాటు చేశారు.

చేరికలపై సమన్వయ కమిటీ
ఈటల రాజేందర్ (కన్వీనర్)
డీకే అరుణ
కె లక్ష్మణ్
వివేక్ వెంకటస్వామి
గరికపాటి మోహన్ రావు
ఎ చంద్రశేఖర్
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దుగ్యాల ప్రదీప్ కుమార్

ఫైనాన్స్ కమిటీ
జితేందర్ రెడ్డి (కన్వీనర్)
గరికపాటి మోహన్ రావు
చాడ సురేశ్ రెడ్డి
చింతల రామచంద్రారెడ్డి
శాంతి కుమార్
యోగానంద్

టీఆర్ఎస్ వైఫల్యాల కమిటీ
ధర్మపురి అర్వింద్ (కన్వీనర్)
రఘునందన్ రావు
వివేక్ వెంకట స్వామి
స్వామి గౌడ్
ప్రకాశ్ రెడ్డి
బాబి అజ్మీరా