NewsTelangana

కేసీఆర్‌కు ఈటల సవాల్… ప్లేస్ ఎక్కడైనా సరే…

Share with

సీఎం కేసీఆర్ బానిసలతో ప్రెస్‌మీట్లు పెట్టించి… అనేక రకాల తిట్ల పురాణాలు, అవమానకర భాష మాట్లాడిస్తున్నారని విమర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. చాలా పెద్దవాళ్లలా కొందరు స్టేట్మెంట్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అనేక ప్రజాసమస్యలు ప్రస్తావించానన్న ఈటల… ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమన్నారు. చర్చకు రమ్మంటే కేసీఆర్ రాకుండా… బానిసలను పంపిస్తున్నారని విమర్శించారు. బానిసలు గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడాలన్నారు. గత చరిత్ర ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు ఈటల. ఒక ఎమ్మెల్యే నోటికి ఏ భాష వస్తే ఎలా మాట్లాడతున్నారని… మనుషుల గెండెలకు గాయాలు చేస్తున్నారన్నారు. అవమానపర్చాలని చూస్తున్నారని బాధపడ్డారు. ఆయన పుట్టిన జాతి గురించి ఎన్నడూ మాట్లాడని వ్యక్తి… గతంలో బెయిళ్ల కోసం తన కోసం ఎదురు చూసిన విషయాన్ని మరచిపోయారన్నారు. ఇదే వ్యక్తి కొంత ఆలస్యమైతే కేసీఆర్‌ను బూతులు తిట్టారని ఈటల గుర్తు చేశారు.

ఒకనాడు టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తులు… ఇవాళ అదే పార్టీలో పోజులు కొడుతున్నారన్నారు. ఇవాళ ఈటలను విమర్శింతచినంత మాత్రాన పెద్దోళ్లు కారన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చినవాళ్లు.. చిన్న పని కాకపోతే బుతులు తిట్టేవారు… వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరకపోముందు సర్పంచ్ కూడా పనిచేయలేదని ఈటల క్లారిటీ ఇచ్చారు. ఉద్యమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని… 2002లో ఎమ్మెల్యే అవుతానని ఎన్నడూ అనుకోలేదన్నారు. ఆనాడు దేశ్ పాండే పిలుపుతో… తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానన్నారు. అవగాహన ఉన్నవాళ్లు పార్టీలోకి వస్తే మేలు జరుగుతుందంటే వచ్చానన్నారు. ఆనాడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ రిజర్వ్డ్ నియోజకవర్గమని… అక్కడ పోటీ చేసే అవకాశమే లేదని… అయినా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేందుకు వచ్చానన్నారు ఈటల. ఎమ్మెల్యే అవుతానని రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తన పోరాట పటిమి చూసి, పనితీరు చూసి 2003లో పల్లెబాట ముగింపు సమావేశంలో కమలాపురం సభ చూసిన తర్వాత కేసీఆర్.. భుజం తట్టారన్నారు. కమలాపురం ప్రాంతంలో ఇంత గొప్ప సభ పెట్టడంతో కేసీఆర్ కితాబిచ్చారు.

2004లో టికెట్ ఇస్తే సత్తా చూపించానన్నారు ఈటల. 2004లో 52 మందికి టికెట్లు ఇస్తే 26 మందే గెలిచారన్నారు. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేస్తే 10 మంది వేరే పార్టీలు అమ్ముడుపోతే… 17 మంది పోటీ చేస్తే కేవలం 7 మంది మాత్రమే గెలిచారని… వారిలో ఉన్నానన్న విషయాన్ని మరచిపోవదన్నారు ఈటల. 2004 మెజార్టీ కంటే 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచానన్న విషయం మరువద్దొన్నారు ఈటల. 2004లో 19,800 మెజార్టీ… 2008లో 23 వేలుకు పెరిగిందన్నారు. ఎవరి బొమ్మతో ఈటల గెలిచాడో కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నాడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోలేదన్నారు. 2004, 2008, 2009లో సత్తా చాటానన్నారు. 2009లో 52 సీట్లకు పోటీ చేస్తే… డైరెక్ట్‌గా… 45, 8 చోట్ల బీఫామ్‌లు ఇస్తే… పట్టుమని పది గెలవలేదని… తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు రాజేంద్రా… అని నాడు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి అన్న విషయానని గుర్తు చేశారు ఈటల. 54 మంది పోటీ చేసినప్పుడు 10 మంది గెలిస్తే వారిలో ఒకడిగా ఉన్నానన్నారు రాజేందర్. 2010లో రాజీనామా చేసే 76 వేల మెజార్టీతో గెలిచాన్నారు. 2014లో తెలంగాణ వచ్చాక బ్రహ్మండమైన మెజార్టీ సాధించి ఎన్నికయ్యానన్నారు. 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ నిజస్వరూపం బయటపెట్టినా విజయం సాధించాన్నారు.

ఎవరెవరైతే స్వతంత్రంగా ఆలోచిస్తారో వారు ఎన్నికల్లో గెలవకూడదని కేసీఆర్ భావించారన్నారు. లాయల్టీ అంటే కేసీఆర్ భాషలో బానిస మనసత్వత్వమన్నారు. మెదడు ఉన్నవాళ్లు, ఆత్మగౌరవం ఉన్నోళ్లు, ఆలోచించేవాళ్లు… స్వతంత్రంగా ఆలోచించే వాళ్లు గెలవకూడదని.. కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారపన్నారు. 2018లో మంత్రులను, ఎమ్మెల్యేలు అందరూ బానిసలు మాత్రమే ఉండాలనుకున్నారని చెప్పారు ఈటల. స్వతంత్రంగా ఉండేవారు మంత్రులుగా ఉంటే పూర్తి స్థాయి కంట్రోల్ ఉండదని కేసీఆర్ ఆందోళనపడేవారన్నారు. స్వతంత్రంగా వ్యవహరించేవారిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేశారన్నారు. 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉన్న తని ఇంటిపైనా దాడులు చేశారని.. ఇదంతా ఎలా జరిగిందో తెలియని వాడిని కానన్నారు. అధికార పార్టీలో ఉండి ఇలా జరిగిందేంటని బాధపడ్డానన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా కొద్ది మంది స్థానిక నేతలతో డబ్బులిచ్చి ఈడీ, ఐటీ దాడులు చేయబోతున్నారని కరపత్రాలు వేశారని చెప్పారు ఈటల. 2018 ఎన్నికలకంటే ముందు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ఐనా హజూరాబాద్ ప్రజలు ధర్మాత్ములని… పుణ్యాత్ములని… గుండెల్లో పెట్టుకొని చూశారన్నారు ఈటల. 20 ఏళ్లుగా ఉన్నా కాబట్టి గెలిపించి అసెంబ్లీకి పంపించారన్నారు. ఇదే ప్రయోగం మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌లో మరో నేతపైనా చేశారని.. వాళ్లంతా ఎన్నికల్లో ఓడినా… హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచానన్నారు ఈటల. ఎన్నడూ కేసీఆర్ ను అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి తిట్టలేదని.. గాయపర్చలేదన్నారు ఈటల.