అమిత్ షా ఎంట్రీ… 15 రోజులకోసారి కోర్ కమిటీ సమావేశం
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీకి అన్ని అవకాశాలున్నాయని… అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 15 రోజులకోసారి కోర్ కమిటీ సమావేశమయ్యేలా ప్లాన్ చేసుకోవాలని పార్టీ నేతలకు అమిత్ షా సూచించారు.
అందరూ సమిష్టిగా మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమాలన్నింటిలో అందరినీ భాగస్వాములు చేయండన్నారు షా. పార్టీ విజయం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలన్నారు… పార్టీకి చేటు కలిగించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా వారిని ఎట్టి స్థితిలో ఉపేక్షించమన్నారు