కలువాయి ఫిషరీస్ ఎన్నికలలో రభస- 144 సెక్షన్ అమలు
ఈరోజు నెల్లురు వద్ద కలువాయి ఫిషరీస్ మెన్ కోపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. కోపరేటివ్ సొసైటీ సభ్యుల మధ్య విభేదాల వలన అధికార పార్టీ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్నారు. అకస్మాత్తుగా నిన్న రాత్రి ఉన్న ఫళంగా ఎన్నికల నిర్వహణ అధికారి మార్పు జరిగింది. మొత్తం సభ్యులు 141 మంది ఉన్నారు. ఈఎన్నికలు ఆరేళ్ల తర్వాత జరుగుతున్నాయి. కొత్త ఎన్నికల నిర్వహణ అధికారిణిగా సుధా భారతి బాధ్యతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈఎన్నికలు జరుగుతున్నాయి. ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో కలువాయి లో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. ఎన్నికల ప్రాంతానికి మీడియాను అధికారులు అనుమతించడం లేదు. ఈ ఎన్నికలకు చాలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈఎన్నికలకు మొత్తం 3 డీఎస్పీ లు, 6 మంది సీఐ లు, 15 మంది ఎస్ఐ లు , 70మంది పోలీస్ కానిస్టేబుళ్లు , స్పెషల్ పార్టీ సిబ్బంది 40 మందిని నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read more ; 6 గంటల విచారణ, నేడు ఈడీ ముందుకు సోనియా