NationalNews

సోమవారం షిండే బలనిరూపణ

Share with

మహారాష్ట్ర సీఎం ఎక్‌నాథ్ షిండే ఈనెల నాలుగో తారీఖున అంటే సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరపుకోవాల్సి ఉంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. 2 తారీఖున స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 3న స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 4న అసెంబ్లీలో బలనిరూపణ జరగనుంది. ఎక్ నాథ్ షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లో అనూహ్యమార్పులు చోటుచేసుకున్నాయ్. ఫడ్నవీస్ సీఎం అవుతారని భావించినా రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయనను డిప్యూటీ సీఎంగా పదవీ స్వీకారం చేయాల్సిందేనని పార్టీ అధినాయకత్వం తేల్చిచెప్పడం తో పరిణామాలు చకచకా మారిపోయాయ్. 39 మంది ఎమ్మెల్యేల మద్దతుందని షిండే దీమాతో ఉన్నారు. మరో పది మంది స్వతంత్రుల మద్దతు ఉందని చెబుతున్నారు. 288 అసెంబ్లీ సభ్యులున్న సభలో బీజేపీకి 106 మంది సభ్యులున్నారు. సభ విశ్వాసం పొందాలంటే 145 మంది అనుకూలంగా వేటేయాల్సి ఉంది.