NewsTelangana

రేపు హైదరాబాద్ కు జేపీ నడ్డా

Share with

శుక్రవారం మధ్యాహ్నం 3గంలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రానున్నారు. బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా… కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం… 6గంలకు నోవాటెల్లో ఫోటో ఎగ్జిబిషన్ ను నడ్డా ప్రారంభిస్తారు. 7 గంలకు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో స‌మావేశం అవుతారు. భ‌ర‌త‌నాట్యం, శివ‌తాండ‌వం, పేర‌ణీ నృత్యాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలతో పాటు దరువు ఎల్లన్న నేతృత్వంలో తెలంగాణ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.