రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
దేశ ప్రధమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. పేదలు సైతం కలలు కనొచ్చని… అవి నిజమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుజువు చేశారు. మొదటి దళిత మహిళగా ముర్ము చరిత్ర సృష్టించారు. దేశంలోనే అతి పిన్నవయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు. ఎవరి హక్కులనైతే కాపాడాలో వారి కోసం తాను జీవితమంతా కృషి చేస్తానని ఈ సందర్భంగా ముర్ము వాగ్దానం చేశారు. దేశంలోని కోట్లాది మహిళల గొంతుకనవుతానని ఈ సందర్భంగా ముర్ము తెలిపారు. ఇది వ్యక్తిగత విజయం కాదని… పేదలు ఏదైనా సాధిస్తారన్న భరోసా ఇచ్చిందన్నారు.