NationalNews

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు విక్టరీ

Share with

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా 44 పార్టీలుండగా… విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మద్దతుగా 34 పార్టీలు నిలిచాయి. పది రాష్ట్రాల్లో ద్రౌపది ముర్ముకు వన్ సైడ్‌గా ఓట్లు పడ్డాయ్. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు గంపగుత్తుగా పడినట్టు తెలుస్తోంది. 1138 మంది ఎమ్మెల్యే ఓట్లలో ముర్ముకు 809 ఓట్లు లభించగా… యశ్వంత్ సిన్హాకు కేవలం 329 ఓట్లు మాత్రమే లభించాయ్. ఆ ఓట్ల విలువ పరిశీలిస్తే… ముర్ముకు లక్షా విలువ చేసే ఓట్లు రాగా… యశ్వంత్ సిన్హాకు కేవలం 44 వేల చేసే ఓట్లు మాత్రమే లభించాయ్. ఇప్పటి వరకు 1886 ఓట్లను లెక్కించగా… వాటి విలువ 6 లక్షల 73 వేలు. వాటిలో ముర్ముకు 4.83 లక్షల విలువ చేసే ఓట్లు లభించాయ్. అంటే దాదాపుగా 70 శాతం ఓట్లు ఆమె పొందారు. అనుకున్నదానికంటే ముర్ముకు అత్యధిక ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది.