భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్, మధ్యలో ఊగిసలాటలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి బలంగా క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు (0.43%) ఎగబాకి 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు (0.41%) పెరిగి 25,107.85 వద్ద స్థిరపడ్డాయి.రోజంతా పాజిటివ్ మూడ్‌లో సాగిన మార్కెట్ పలు కంపెనీలు మంచి లాభాలను నమోదు చేశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్ టైల్స్ , నాగరీకా ఎక్స్ పోర్ట్ , కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం చోటు చేసుకున్నాయి.అయితే, మరోవైపు కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ షేర్లు క్షీణించాయి.వారాంతం నాడు మార్కెట్ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చేలా ముగిసింది.

