Home Page SliderTelangana

‘దుర్గం చెరువు పరిధిని నిర్ణయించండి’..హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు హైకోర్టు చిన్న బ్రేక్ వేసింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ శాస్త్రీయంగా నిర్థారణ జరగలేదంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిని హైకోర్టు ఈ బాధితుల అభ్యంతరాలు పరిగణించి, వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై తమ అభ్యంతరాలను తెలియజేయమని బాధితులకు సూచించింది. అలాగే 6 వారాల సమయంలోగా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్థారించాలని వారికి హైకోర్టు ఆదేశించింది. రికార్డుల ప్రకారం 65 ఎకరాలు ఉంటే 160 ఎకరాలని అధికారులు పేర్కొంటున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీనిపై సరైన నివేదిక ఇవ్వాలని కోర్టు జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. అంతవరకూ అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదని కోరింది.