రెండు పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కొందరికి మాత్రం ఫ్లెక్సిబుల్‌గా ఉంటే.. మరికొందరికి కఠినంగా ఉంటాయ్. ఏఐసీసీచీఫ్‌గా ఉండాలంటే తాను రాజస్థాన్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకోవాలని గెహ్లాట్ కోరితే.. ఒక వ్యక్తికి ఒక పోస్టు మాత్రమే నని నాడు రాహుల్ గాంధీ కుండబద్ధలుకొట్టారు. కానీ ప్రస్తుత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విషయంలో నిబంధనల్లేవంటోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతారని తెలుస్తోంది. ఆయనకు ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి సోనియా గాంధీ ఖర్గే, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌లను మాత్రమే పిలవడంతో అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. ఈ సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ముందున్న దిగ్విజయ్ సింగ్, పి చిదంబరాన్ని ఆహ్వానించలేదు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం ప్రతిపాదించిన గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో.. చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చారు. రాజస్థాన్‌లో ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎంగా నియమించాలని గాంధీలు భావిస్తే.. అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన ధిక్కార స్వరాన్ని విన్పించారు. సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేజస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించడం జరిగిపోయాయి. కానీ పార్టీ చెప్పినట్టే నడుచుకుంటామన్నారు. ఆ తర్వాత అటు గెహ్లాట్ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పక్కనబడేసింది. అక్టోబర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు “అధికారిక” అభ్యర్థిగా ఖర్గే ఖరారయ్యారు. ఖర్గే కాంగ్రెస్ చీఫ్ కోసం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాలకైనా ఆయన పాత్రలో కొనసాగవచ్చని తెలుస్తోంది.

