కామెడీ కింగ్ బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ల తాజా చిత్రం
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి మంచి గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ చూస్తే.. హీరో దరిద్రంను పర్స్‌లో పెట్టుకుని బ్రతుకుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ దరిద్రం నుంచి హీరో బయటపడ్డడా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు వేచిచూడాల్సిందే. ఫుల్ హిలేరియస్‌గా ఉన్న ఈ గ్లింప్స్ ప్రస్తుతం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయనున్నామన్నారు నిర్మాతలు. ఇక ఈ గ్లింప్స్ చివరిలో బ్రహ్మానందం పంచెకట్టులో మాస్ ఎంట్రీతో కనబడతారు.

