నేడే ఛాంపియన్స్ ట్రోఫీ..మొదటి మ్యాచ్ ఆ దేశాల మధ్యే..
క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేడే ప్రారంభం కానుంది. గ్రూప్ ఏ నుండి రెండు టీమ్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో కివీస్ నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు తలపడనుంది. గ్రూప్ ఏలో భారత్, పాక్, కివీస్, బంగ్లాదేశ్‌లు ఉండగా, గ్రూప్ బిలో ఆఫ్గాన్, సౌతాఫ్రికా, ఆసీస్, ఇంగ్లాండ్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుండి టాప్ రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. వాటి నుండి గెలుపొందిన జట్ల మధ్య ఫైనల్స్ ఉంటుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో జరగడం లేదు. భారత్ తొలి మ్యాచ్ రేపు బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్, స్పోర్ట్స్ 18 ఛానెల్స్‌లో లైవ్ చూడవచ్చు.