ముందస్తుకు వెళ్లేంత సీన్ కేసీఆర్‌కు లేదు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మీడియాతో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశమే లేదని, క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఆయన అలా భావిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ తనను రాజ్‌భవన్‌లో కలిసిన తర్వాత కూడా ఎటువంటి ప్రోటోకాల్ ఇవ్వలేదన్నారు. మా మధ్య సంబంధాల్లో స్టేటస్ కోనే ఉంది కాబట్టి ప్రోటోకాల్ అడగడం మానేశానన్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల సమయంలో కలెక్టర్ రావాల్సి ఉన్నప్పటికీ రాలేదన్నారు. గవర్నర్ అయినంత మాత్రాన అందరిలాగా రాజ్‌భవన్‌కే పరిమితం కానని,వేరే గవర్నర్లతో తనని పోల్చోద్దని అన్నారు. అదే విధంగా ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని,తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నారు.ప్రజలలో చాలా మంది తమకు ఎప్పుడు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తారని అడుగుతున్నారన్నారు. అయితే తాను ఇప్పటికే పలు ఎన్జీవోల ద్వారా ప్రజలకు దుస్తులను అందించానని తెలిపారు. మొన్న విమానంలో కూడా ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడానని, అయితే త్వరలో ఎయిర్ హూస్టెస్‌కు అత్యవసర సమయంలో సిపిఆర్ ఎలా చేయాలి అనే అంశంపై శిక్షణ ఇప్పిస్తామన్నారు.