కుప్పంలో బాదుడే బాదుడు
చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన మంటలు రేపింది. వర్గ పోరును రాజేసింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా కుప్పం చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే పలు ప్రాంతాల్లో టీడీపీకి ధీటుగా వైసీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున తమ పార్టీలు జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో గొడవ రాజుకుంది. తమ జెండాలను తొలగించాలని టీడీపీ కార్యకర్తలు కోరినా వైసీపీ నేతలు అస్సలు పట్టించుకోలేదు. దీంతో కుప్పం నియోజకవర్గం పరిధిలోని కొల్లుపల్లిలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పరిస్ధితి చేయిదాటి పోయింది. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ కార్యకర్తలను నియంత్రించడానికే ప్రయత్నించారు. వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనలో మీ బ్యానర్లు ఏంటంటూ.. టీడీపీ కార్యకర్తలు వైసీపీ వారిపై మండిపడ్డారు. పోలీసులకు చెప్పిా వారు వినీ విననట్లు ఉండి పోయారు. దీంతో బాబు పర్యటన టెన్షన్ గా మారింది. రేపటి నుండి నిర్వహించాల్సిన బాదుడే బాదుడు కార్యక్రమంపై టీడీపీ దృష్టి పెట్టింది. దేనికైనా సిద్ధమంటూ సంకేతాలు ఇస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కుప్పం ప్రధమ స్ధానంలో ఉంది. అందువల్తల సభ్వత్వ నమోదు అంశాలను పరిశీలించి, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు బాబు. పలమనేరు పైవేలో నూతనంగా నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.


