భార్యపై అనుమానంతో బిడ్డ హత్య…
చెన్నైలోని అన్నానగర్లో దారుణం చోటు చేసుకుంది. చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్(33) అనే వ్యక్తి భార్య, తాను నల్లగా ఉన్నప్పటికీ తమ బిడ్డ తెల్లగా ఎలా పుట్టిందనే అనుమానంతో రగిలిపోయాడు. రెండేళ్ల పాపను కనికరం లేకుండా హతమార్చాడు. అతని భార్య ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు మసీదుకు వెళ్లగా, ఆమె లేని సమయం చూసి చిన్నారిని గొంతు నులిమి హత్య చేశాడు. భార్య తిరిగి వచ్చేసరికి చిన్నారి అపస్మారక స్థితిలో ఉండడంతో ఊయల తాడు వల్ల గొంతు బిగుసుకుందని అబద్దం చెప్పాడు. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు తేలింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు పోస్టుమార్టం చేయించారు. దీనిలో గొంతు నులిమడం వల్లే చనిపోయిందని తేలింది. దీనితో జావిద్‌పై అనుమానంతో అరెస్టు చేసి, విచారించగా అసలు విషయం బయటపడింది.

