బ్రెయిన్ డెడ్ మహిళ కడుపులో బిడ్డ..
విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.. కొన్ని సందర్భాలలో విచిత్ర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. గర్బం దాల్చిన ఒక మహిళ తన మెదడులో రక్తం గడ్డకట్టేయడంతో బ్రెయిన్ డెడ్‌కు గురయ్యింది. కానీ ఆమె కడుపులోని పిండాన్ని బతికించడానికి వైద్యులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని జార్జియాలో అట్లాంటాకు చెందిన ఆడ్రియానా స్మిత్ అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఈ ఫిబ్రవరిలో ఆమెకు 9 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తలనొప్పి రావడంతో అనారోగ్యానికి గురయి, బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టింది. దీనితో పరిస్థితి విషమించి ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యింది. అప్పటి నుండి లైఫ్ సపోర్ట్ మీదే ఉంది. అక్కడి అబార్షన్ చట్టం ప్రకారం పిండంలో హార్ట్ బీట్ ఉంటే అబార్షన్‌కు అనుమతి ఉండదు. ప్రస్తుతం 21 వారాల వయసులో గర్భస్థ శిశువు ఉంది. ఎలాంటి స్పందనా లేకుండా శవంలా పడి ఉన్న ఆమెను చూసి, ఆమె కుటుంబం విలపిస్తోంది. ఆమె కళ్ల ముందు కనిపించినా లేనట్లే అని, గర్భస్థ శిశువు బయట పరిస్థితులు తట్టుకుని బయటపడేంతవరకూ ఆమెను అలా లైఫ్ సపోర్టు మీదే కొనసాగిస్తున్నారు.