Andhra PradeshNews

దారపునేని నరేంద్రను పరామర్శించిన చంద్రబాబు

టీడీపీ మీడియా సమన్వయకర్త దారపునేని నరేంద్రను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. గుంటూరుకు వచ్చిన చంద్రబాబు, నరేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్యపడొద్దని… అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో పోస్టుల కేసులో సీఐడీ అధికారులు నరేంద్రను అరెస్ట్ చేశారు. తాజాగా సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. నరేంద్రను పరామర్శించిన చంద్రబాబు సీఐడీ విచారణ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరి సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. పార్టీ తరుపున ఎప్పుడూ..అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని ప్రయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.