NewsNews AlertTelangana

కత్తితో కానిస్టేబుల్ మీద చైన్ స్నాచర్ల దాడి

Share with

భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లని పోలీసులు నిందితులని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు చైన్ స్నాచర్లుని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు ఇషాన్, రాహుల్ గా గుర్తించామని తెలిపారు. వీరు ఈ నెల 22న గుల్బర్గా నుండి  బైక్‌పై  హైదరాబాద్‌కి వచ్చారని స్పష్టం చేశారు. వీరిని గురువారం మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.  నిందితులు ఇద్దరినుండి రెండు తుపాకీలు , 15 తూటాలు  , రెండు కత్తులు , 47 గ్రాముల బంగారం , ద్విచక్రవాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. కొండాపూర్ , మూసాపేట్ , ఆర్సీపురంలో ముగ్గురు మహిళల చైన్‌లను దోచుకున్నారు. నిందితులు 25న మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీలో ఇద్దరు బైక్ పై వచ్చి మహిళ గొలుసు లాకెళ్లారని చెప్పారు.

అలాగే ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నం చేయగా కుదరకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయారని అన్నారు. ఒక్క రోజులో  నాలుగు గంటల వ్యవధిలో 3 పీఎస్‌ల పరిధిలో గొలుసులు దొంగిలించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చెపట్టారు. చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక టీమ్స్ సిద్ధం చేసామన్నారు. బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు వాహనాలను తనిఖీలు నిర్వహించిన పోలీసులు…. బీహెచ్ఈఎల్ వైపు గొలుసు దొంగలు వెళ్లినట్టు గుర్తించారు. తనిఖీలలో భాగంగా పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తులని  గుర్తించిన సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య , దిబేష్ కలిసి  పట్టుకున్నారు. పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టి… దొంగలను పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో తప్పించుకొవడానికి ప్రయర్నిచిన ఇషాన్  యాదయ్యపై కత్తితో దాడి చేసాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మిగత పోలీసులు  ఈ సమాచారం నిందితులని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాయపడ్డ యాదయ్య ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.