Telangana

ప్రారంభమైన ఫిల్మ్‌ఛాంబర్ సమావేశం

Share with

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి కొన్ని రోజులుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నారు. నేడు ఫిలిం ఛాంబర్ సినీ ప్రముఖుల ఈ విషయంపై  భేటీ మొదలయ్యింది. అన్ని విషయాలపై చర్చించడానికి  సమావేశం ఏర్పాటు చేసారు. నిన్ననే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశమై  ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను ఆపేస్తున్నట్లు మీడియాకు  ప్రకటన ఇచ్చింది. సినిమా షూటింగ్‌లు ఆపేస్తే చాలామంది కార్మికులకు కష్టమౌతుందని, పెద్ద హీరోల  సినిమాలు షూటింగ్‌లలో ఉన్నాయని ఫిల్మ్‌ఛాంబర్ భావిస్తోంది.  ఈసమావేశానికి ఛాంబర్ ప్రెసిడెంట్, నిర్మాతలు , ఎగ్జిబిటర్లు , ఫెడరేషన్ సభ్యులు హాజరైనారు. కాస్ట్ కటింగ్ , ఓటిటి, ఫెడరేషన్ మొదలైన సమస్యలపై చర్చ లు చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ సినిమాల చిత్రీకరణల నిలుపదలపై  క్లారిటి ఇవ్వబోతున్నట్లు సమాచారం.