NewsNews AlertTelangana

21ఏళ్ల వయస్సులోనే..భారీ ప్యాకేజితో కొలువు

Share with

అతి చిన్న వయస్సులోనే రూ.64లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాలా గట్టిగా చాటిచెప్పాడు ఒక యువకుడు.తనను కన్నతల్లిదండ్రులకు సమాజంలో గొప్పపేరు,ప్రఖ్యాతలను సంపాధించి పెట్టడమే కాకుండా నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు ఆ యువకుడు. అతనే తంగెళ్లపల్లి నిఖిల్. ఖమ్మం జిల్లా టేకులపాడు మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన ఈశ్వరాచారి-అనితాలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వారిలో పెద్ద కుమారుడే ఈ నిఖిల్. ప్రాథమిక విద్యను మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ,హైస్కూల్ విద్యను టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. 2015-2016లో పదో తరగతిలో 10 జీపీఏని సాధించారు.

దీంతో నిఖిల్‌కు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కింది. అయితే 6 సంవత్సరాలు ఇంటర్‌తో పాటు ఉండే ఈ కోర్సులో నిఖిల్ ప్రస్తుతం బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చివరి సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇటీవల క్యాంపస్‌లో జరిగిన ప్లేస్‌మెంట్స్‌లో అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్  డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా  ఉద్యోగం సంపాధించారు. ఏడాదికి వేతనం రూ.64 లక్షలతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని అమెజాన్ కంపెనీలో మరో 2 నెలల్లో ఉద్యోగంలో చేరనున్నట్లు నిఖిల్ తెలిపారు. రూ.64 లక్షల ప్యాకేజీతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం తమకు చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.