మంకీ పాక్స్‌పై కేంద్రం అలర్ట్
దేశంలో మంకీఫాక్స్ కేసుల పెరుగుదలపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ లో నేడు ఒక మంకీఫాక్స్ కేసు నమోదు కావడంపై కేంద్రం అప్రమత్తయ్యింది. విదేశాల్లో పర్యటించే లక్షణాలు లేకున్నా ఓ ఢిల్లీ వ్యక్తికి మంకీ పాక్స్ రావడంపై కేంద్రం అలర్ట్ అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీ పాక్స్ కేసులు కేరళలో నమోదు కాగా… ఢిల్లీలో ఒక కేసు నమోదయ్యింది.
మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో మంకీఫాక్స్ కేసుల వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాలసిన చర్యల పై అధికారులు చర్చించారు. మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న బాధితుల కోసం లోక్ నాయక్ హాస్పిటల్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.