కుటుంబంలో చిచ్చు రాజేసిన కేశినేని నాని
కేశినేని నాని , కేశినేని చిన్నిల మధ్య మెదలైన కుటుంబ వివాదం ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారుతోంది. విజయవాడ ఎంపీ , టీడీపీ నేత కేశినేని నాని గుర్తు తెలియని వ్యక్తులు తన పేరు , హోదాను వినియోగించుకుని కొన్ని వ్యవహారాలు నడుపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఎంపీగా ఉపయోగించే వాహన నెంబర్ టీఎస్ 07 HW 7777 ను , నకిలీ సృష్టించి హైదరాబాద్ నగరాలలో తిరుగుతున్నరన్నారు. ఎంపీ నాని ఫిర్యాదు మేరకు పోలీసులు జూన్ 9న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి , ఐపీసీ 420, 416 , 415 తోపాటు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. సోమవారం జరిగిన తనిఖీలో ఆ నెంబర్ ఉన్న వాహానాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించి విచారణ చేయగా , అన్ని సవ్యంగా ఉన్నయని వదిలేశారు. కానీ ఆ వాహనం… కేశినేని జానకి లక్షీ పేరుతో ఉంది. అయితే ఈ వాహనాన్ని ఎక్కువగా కేశినేని జానకి భర్త , కేశినేని శివనాథ్ వినియోగిస్తుంటారు .
విచారణ గురించి తెలుసుకున్న కేశినేని నాని ఈ వ్యవహారాలన్ని చిన్నినే నిర్వహిస్తున్నారని ఆయనపై ఫిర్యాదు చేయడంతో పార్టీలో కలకలం రేగింది. నాని ఫిర్యాదుతో మొత్తం వ్యవహారంపై కేశినేని చిన్ని స్పందించారు. కారుపై ఎటువంటి స్టిక్కర్ లేదని.. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహారమే కానీ రాజకీయ పరమైనది కాదన్నారు. ఇటువంటి విషయాల్లో ఆడవారిని బయటకు లాగడం సరికాదన్నారు.