త్వరలోనే భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైళ్లు
నేడు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పార్లమెంట్ ఉభయసభలలో మాట్లాడుతూ బుల్లెట్ రైలు విషయాన్ని ప్రస్తావించారు. త్వరలోనే భారత్‌లో బుల్లెట్ రైలు కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో ఈ కారిడార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మౌలిక సదుపాయాలు భారత్ ముఖచిత్రాన్ని అత్యాధునికంగా మార్చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే 508 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు వ్యవస్థ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనితో ఈ ప్రయాణం కేవలం 2 గంటల్లో పూర్తవుతుంది. దీనిని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది. తొలిదశలో ఆరు ట్రైన్లను జపాన్ నుండి కొనుగోలు చేయనున్నారు.

