Home Page SliderInternational

ప్రపంచవేదికపై ‘దేవర’ సరికొత్త రికార్డ్

Share with

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన దేవర చిత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం ఒక కొత్త ఘనతను కూడా సాధించబోతోంది. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. దీనికోసం ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్లనున్నారని సమాచారం. సెప్టెంబర్ 26న సాయంత్రం ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో ఈ షో వేయనున్నట్లు సమాచారం. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొంటారు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని చూడబోతున్నారు. గతంలో  ఏ చిత్రానికీ ఇలాంటి గౌరవం లభించలేదు. కాగా ఈ చిత్రంలో మూడు సీన్స్ కట్ చేయాలని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.