Home Page SliderNews AlertTelangana

ఉద్యోగి చెంప పగులగొట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

మందమర్రి టోల్‌ ప్లాజా సిబ్బందిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి బెల్లంపల్లికి వెళ్తోన్న సమయంలో మార్గ మధ్యలో మందమర్రి టోల్‌ ప్లాజా వద్ద ఆయన కారును అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. టోల్‌ అమౌంట్‌ను వసూల చేయడానికి వారు ఆయన కారును ఆపడంతో దుర్గం చిన్నయ్య ఆగ్రహించారు. కారు దిగి నేరుగా టోల్‌ బూత్‌ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. సిబ్బందితో గొడవ పడ్డారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. టోల్‌ప్లాజా సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారమంతా టోల్‌ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయింది. అయితే.. ఈ ఘటనపై మందమర్రి పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. టోల్‌ ప్లాజా వద్ద గొడవ జరిగిన విషయం, ఎమ్మెల్యే అక్కడి సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదులు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. ఇంత ఒపెన్‌గా గన్‌మెన్ల పహారాలోనే గూండాగారి జరుగుతూ ఉంటే ఎట్ల చూస్తూ ఊరుకోవాలి. కేసీఆర్‌ కో హఠావో, తెలంగాణకో బచావో అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.