డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో పెళ్ళి ఇవాళ చండీగఢ్‌లో జరగింది. హర్యానాకు చెందిన గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ సింగ్ రెండో వివాహం చేసుకున్నారు.
మౌలానా వైద్య కళాశాలలో గురు ప్రీత్ గోల్డ్ మెడల్ పొందారు. చంఢీగడ్ సెక్టార్ 8లోని ఓ గురుద్వారాలో వీరి వివాహాం అతికొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
పెద్దలు కుదిర్చిన పెళ్లిగా సన్నిహిత వర్గాల సమాచారం. రెండు కుటుంబల మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. అదికాక ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల సమయంలో మాన్‌కి, గురుప్రీత్ కౌర్ ఎంతగానో సహకరించారు. ఈ వివాహా వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీ సమేతంగా హాజరయయ్యారు.
మాన్‌కు ఇంతకు ముందే ఇందిర్ ప్రీత్ కౌర్‌తో వివాహాం జరిగందన్న విషయం తెలిసిందే, కొన్ని కారణాలతో ఆరేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నారు. మాన్‌కు ఇద్దరు పిల్లలు సీతర్, దిల్షాన్ ఉన్నారు. భగవంత్ మాన్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేడుకు తన ఇద్దరు పిల్లలు హాజరయ్యరు. రాజకీయల్లోకి రాకమునుపు మాన్ నటుడిగా, కమెడియన్‌గా, వ్యంగ్యకారుడుగా పలురంగాల్లో పనిచేసారు.
ప్రస్తుతం మాన్ పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంజాబ్ కేబినేట్ విస్తరణ తర్వాత బుధవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రజలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పంజాబ్ ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ లభిస్తుందని తాజాగా మాన్ ట్వీట్ చేశారు.