పుష్కర్ ఘాట్‌లో బోటు మునిగి…
రాజమండ్రిలో పెనువిషాదం చోటు చేసుకుంది.గోదావరి నదిలో బోటు మునిగి పలువురు గల్లంతయ్యారు.రాజమండ్రి సమీపంలోని పుష్కర్ ఘాట్ లో ప్రమాదవశాత్తు బోటు మునిగిపోయింది.ప్రమాద సమయంలో పడవలో ముగ్గురు ప్రయాణిస్టున్నట్లు తెలిసింది.గల్లంతయినవారిలో గాడ రాజు, చబల అన్నవరం తోపాటు మరో వ్యక్తి గోదావరిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.వీరంతా కోడిపందేల కోసం బయలుదేరినట్లు తెలిసింది.అయితే బోటు నడిపే వ్యక్తి కూడా గల్లంతైన వారిలో ఉన్నాడా లేదా అనేది పోలీసులు విచారిస్తున్నారు.ఘటనా స్థలంలో లభించిన వివరాల ఆధారంగా ఎంత మంది గల్లంతయ్యారని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గల్లంతైన ముగ్గురు యువకుల బంధువులు,స్నేహితులతో పుష్కర్ ఘాట్ శోకసంద్రంగా మారింది.

