రైతన్న జర జాగ్రత్త.. బ్యాంక్ ఉద్యోగి ఏం చేశాడంటే..
తెలంగాణలోని అచ్చంపేట SBI బ్యాంకులో బ్యాంకు ఉద్యోగి బాగోతం బయటపడింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట SBI బ్యాంకు ఉద్యోగి కిరణ్, 45 మంది రైతుల ఖాతాల నుంచి కోటిన్నర రూపాయలను తన ఖాతాకు మళ్లించాడు. విషయం తెలుసుకున్న రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కిరణ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో బ్యాంక్ పైఅధికారులు కిరణ్ ను సస్పెండ్ చేశారు. రైతుల నిలదీతతో డబ్బులు తిరిగి జమ చేస్తానని కిరణ్ హామీ ఇచ్చాడు.


 
							 
							