నిండుకుండలా తుంగభద్ర
కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్రానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హంపీ స్మారక చిహ్నాలు, అనేక శిల్పాలు నీట మునిగాయి. స్నానఘట్టాలు, అనేక మండపాలు పూర్తిగా ముంపులో ఉన్నాయి. ఆలయాలన్నీ మునిగిపోయాయి. ప్రజలు వరదముంపు వల్ల పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. హంపి సందర్శనకు ఎవరూ రాకుండా అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 30 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరద ఇన్ ఫ్లో: 1,58,400క్యూసెక్కులు ఔట్ ఫ్లో: 1,44,195 క్యూసెక్కులు గా ఉంది. ఈజలాశయం పూర్తి సామర్థ్యం:105.788 టీఎంసీలు అయితే, ప్రస్తుతం నీటి నిల్వ:94.514 టీఎంసీలు.ఉంది. ,ప్రస్తుత నీటి మట్టం 1630.12 అడుగులు. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద వచ్చినట్లయితే దాని సామర్ద్యానికి మించి ప్రవహించే ప్రమాదం ఉంది.