5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణకు నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం సోమవారం ఉదయం వెల్లడించింది. మిజోరం ఈ సంవత్సరం ఎన్నికల చివరి రౌండ్‌ను ప్రారంభించనుంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటింగ్ నవంబర్ 7న ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో – నవంబర్ 7 మరియు నవంబర్ 17న పోలింగ్ జరుగుతుంది. అన్ని ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.

తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ 19, బీజేపీ ఒకచోట, మజ్లిస్ 7 స్థానాల్లోనూ గెలిచింది.టీడీపీ రెండు చోట్ల, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. మధ్యప్రదేశ్ లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లోనూ, బీఎస్పీ 2 చోట్ల గెలుపొందింది. మధ్య ప్రదేశ్ లో మొత్తం 230 సీట్లున్నాయి. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 15 చోట్ల గెలిచింది. అజిత్ జోగికి చెందిన జేసీసీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది.ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ 73 స్థానాల్లో గెలిచింది. ఇక బీఎస్పీ 6 స్థానాల్లోనూ, ఇతరులు 20 స్థానాల్లో గెలిచారు. రాజస్థాన్ లో మొత్తం 200 స్థానాలున్నాయి. మిజోరామ్‌లో 40 స్థానాలుండగా 2018 ఎన్నికల్లో అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 27 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 4, బీజేపీ 1 స్థానంలోనూ, స్వతంత్రులు 8 చోట్ల గెలిచారు.

