విద్యార్థులు చేసిన కొత్తరకం బైక్
ఐదుగురు ప్రయాణించేలా టూవీలర్ బైక్ మోడల్‌లో గుంటూరు జిల్లా తాడేపల్లి లోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేశారు.
తాడేపల్లి: ఐదుగురు ప్రయాణించేలా టూవీలర్ బైక్ మోడల్‌లో గుంటూరు జిల్లా తాడేపల్లి లోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేశారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రిపుల్-ఈ, సీఎస్సీ, మెకానికల్ విభాగాల విద్యార్థులు దీపక్‌రెడ్డి, లలిత్‌కుమార్, నితిన్ చక్రవర్తి, జ్ఞానేశ్వర్ రెడ్డి, వినోద్, భరద్వాజ, మురళీ మనోజ్, చంద్రశేఖర్ భారిక్ కలిసి ఈ-బైక్ రూపొందించారు. ఐదుగురు కూర్చునేందుకు బైక్‌ను 4 మీటర్ల పొడవులో తయారు చేశారు. బ్యాలెన్స్ సమస్య తలెత్తకుండా అడ్వాన్స్‌డ్ డైనమిక్స్ స్టిమ్యులేషన్‌తో బరువు రెండు చక్రాలపై సమానంగా పడేలా చూసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని 30 రోజుల్లోనే రూపొందించారు. బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 100 కి.మీ. వెళ్లొచ్చు. పర్యాటక ప్రాంతాల్లో కుటుంబ సభ్యులంతా ఈ బైక్ పై సులువుగా తిరగొచ్చు. అధికారుల పరీక్షలు పూర్తయ్యాక ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.